Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ఈ నెల12న ఆదివారం పట్టణ కేంద్రంలోని మథర్ థేరేస్సా స్కూల్లో జరగబోయే 10 వ తరగతి విద్యార్థుల జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆ సంఘం పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శి ఈర్ల రాహుల్, చింతల శివ మాట్లాడుతూ అధ్యయనం- పోరాటం అనే నినాదాన్ని ముందు తీసుకుపోతు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అనునిత్యం పోరాడుతూనే విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ నాయకులు నిలిగొండ సాయి,రమణ, అజయ్, శివ,అజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.