Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
పచ్చిక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వివిధ దశల్లో నిరంతరంగా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమ ఫోరం నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్ కే చాంద్, మాజీ ఎంపీటీసీ సాల్వేర్ అశోక్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ లో ఈనెల 12న హైదరాబాదులోని సుందర విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేసి, పదివేల కోట్ల బడ్జెట్ లో కేటాయించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 20శాతం తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలనిడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమ సీనియర్ నాయకులు సంగిశెట్టి సాయిబాబా, కేశవ దాసు సునీల్ కుమార్, కందుల నరసింహ, గుండ్లపల్లి బాలయ్య, షేక్ లతీఫ్, యం డి యాకూబ్, అరిగే బాలయ్య, లవణం శ్రీను తదితరులు పాల్గొన్నారు.