Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ఇబ్రహీంపట్నం నుంచి నారాయణపురం వరకు బండాలేమురు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు అధికారులు గురువారం రోడ్డు పరిశీలన చేశారు. ఈనెల 7 వ తేదీన బండలేమురు సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో పలువురు నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ను కలిసి ఇబ్రహీంపట్నం నుంచి బండలేమురు మీదుగా నారాయణపూర్ వరకు ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ మార్గంలో బస్సు నడిపించేందుకు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎస్టీఐ సౌజన్య ఆధ్వర్యంలో అధికారులు రోడ్డు పరిశీలన చేశారు. ఇబ్రహీంపట్నం నుంచి మంచాల, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ, బండాలేమూర్ మీదుగా నారాయణ పూర్ వరకు బస్సులో వెళ్లి రోడ్డును పరిశీలించారు.బండలేమూర్ నుంచి పొర్లగడ్డగడ్డతండా వరకు ఉన్న రోడ్డు వర్షాల కారణంగా ధ్వంసమైంది. సుమారు రెండున్నర సంవత్సరాలుగా ఈ మార్గంలో నడిచే బస్సు రద్దయింది.దాంతో ఈ మార్గంలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రోడ్డుకు సుమారు 24 లక్షల మేర నిధులు వెచ్చించి చిత్రమైన రోడ్డును బాగు చేయడం జరిగింది. రద్దయిన బస్సులు నడిపించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ను కలిసి విన్నవించడం జరిగింది. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం ఆర్ టీ సి అధికారులు ఈ మార్గంలో రోడ్డును పరిశీలిం చారు. ఆర్టీసీ బస్సు నడిచేందుకు అనువుగా ఉండడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.బస్సులు త్వరలోనే పునరుద్ధరించేందుకు అధికారులు సంసిద్ధం అవుతున్నారు. ఆర్టీసీ అధికారుల పరిశీలన సందర్భంగా సీపీిఐ(ఎం) నాయకులు గ్రామస్తులు కలిసి నారాయణపురం వరకు రోడ్డు మార్గాన్ని పరిశీలన చేసి ఆయా తండాల్లో గిరిజనులతో మాట్లాడారు.. ఆర్టీసీ బస్సు తిరిగి ఈ మార్గంలో నడిపిస్తామనడంతో గిరిజన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దు గ్రామాల ప్రజలకు రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానున్నదంతో ఆర్టీసీ అధికారులకు,ఆగిపోయిన బస్సును పునరుద్ధరించడం కోసం అవిరిరామంగ కృషి చేస్తున్న సీపీఎం నాయకులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బండలేమూరు మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ,మాజి ఎంపీటీసీ వట్టి వెంకటేశ్, సీపీఐ (ఎం) గ్రామ కార్యదర్శి జోగు శ్రీనివాస్, నాయకులు జోగు జగదీశ్వర్,మలం జంగయ్య, జోగు దర్శన్, జర్పుల కిషన్,కరంతొట్ శంకర్, బద్దుల రమేష్ , వలపు రంగయ్య, జారుపుల రవి, కొంకానీ అరవింద్, కెళ్లోత్ తండ గిరిజన నాయకుడు దుద్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.