Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే మన బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ కేసీఆర్ ఉచిత హామీలు తప్ప అమలులో విఫలం అయ్యారని పీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య అన్నారు. నాలుగో రోజు హాత్ సే హాత్ జోడో యాత్ర బ్రాహ్మణపల్లి, సుద్దాల,బుర్జుబావి,అనంతారం గ్రామాల్లో కొనసాగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రైతులు,నిరుద్యోగులు ఏ ఒక్కరు సంతోషంగా లేరన్నారు.జూడో యాత్ర ద్వారా గడప గడపకు తిరిగి ధరణి పోర్టల్,రేషన్ కార్డ్,పెన్షన్ స్కీమ్,డబుల్ బెడ్ రూమ్,నిరుద్యోగ భృతి,ఏకకాలంలో రుణమాఫీ,నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల లాంటి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అండెం సంజీవరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గౌడ్,మాజీ ఎంపీపీ,జెడ్పీటీసీలు ద్యాప కృష్ణారెడ్డి,కోలుకొండ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్,వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మి,సర్పంచ్ లు తుమ్మ డెన్నిస్ రెడ్డి,ఏలూరి రాంరెడ్డి,ఎంపీటీసీ కొర్న నరేష్ నాయకులు కుమ్మరికుంట్ల రాజారత్న,నూనెముంతల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.