Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట మున్సిపల్ లోని అస్తవస్థ డ్రెయినేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు కోరారు. గురువారం యాదగిరిగుట్టలో ఆ పార్టీ పట్టణ, మండల కమిటీ ఆధ్వర్యంలో పాత గుట్ట రోడ్డు లోని అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ పరిశీలించారు.ఈ సందర్భ ంగా మాట్లాడుతూ యాదగిరిగుట్ట పట్టణం మేజర్ గ్రామపంచాయతీ నుండి మున్సిపల్్గా మారిన తర్వాత పట్టణంలో మౌలిక సౌకర్యాలు మెరుగు అవుతాయనుకుంటే అడియాశలయ్యాయని అన్నారు. పట్టణంలో నూతనంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లకు డబ్బులు మంజూరు అయినట్లు ప్రకటనలు చేశారని ఆచరణలో మాత్రం శూన్యంగానే ఉందని తెలిపారు. అధికారులు ,ప్రభుత్వం స్పందించి డ్రెయినేజీ వ్యవస్థను విద్యుత్తులైట్లను ,ఇతర మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బబ్బూరి పోశెట్టి నాయకులు కానుగంటి రామచందర్ ,బండ్రెడ్డి ఈశ్వర్ రెడ్డి ,కానుగంటి రాం భారు తదితరులు పాల్గొన్నారు.