Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యువతను పూర్తిగా విస్మరించాయని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్ అన్నారు. గురువారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో డీవైఎఫ్ఐ మండల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో 45,03,097 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 2,90,396 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఇందులో పూర్తిగా యువతను విస్మరించిన బడ్జెట్ తప్ప యువతకు కోసం చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కనీసం బడ్జెట్లో ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించే పరిశ్రమలు నెలకొల్పడం కోసం దృష్టిపెట్టినట్టుగా బడ్జెట్లో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కూడా విస్మరించిందన్నారు. యువత అభివృద్ధి కోసం 1117 కోట్లు మాత్రమే ప్రకటించడం విచారకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను విస్మరించినట్టు ప్రతి బడ్జెట్లో కనిపిస్తుందన్నారు. మండలకార్యదర్శి పల్లె మధుకృష్ణ మాట్లాడారు. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో రానున్న కాలంలో స్థానిక సమస్యలను గుర్తించి దఫాలుగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం మండల అధ్యక్షులు సామిడి నాగరాజురెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రత్నం శ్రీకాంత్, నత్తి నరేశ్, పల్లె అనిల్‌కుమార్, రొడ్డ మధు, బోయ పృథ్వీ, గంగాధర్, సంగిశెట్టి నాగరాజు పాల్గొన్నారు.