Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
లారీ ఓనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ అసోసియేషన్ అధ్యక్షులు మంచి రెడ్డి రాజేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంటేరు మాధవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం గొంగిడి నిలయంలో డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ లారీ యజమాన్యుల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, ప్రతాప్ రెడ్డి, సంతోష్ గౌడ్ , భగవంతు రెడ్డి, మహేష్ గౌడ్, అశోక్ యాదవ్, పత్తి వెంకటేష్, వి శ్రీనివాస్ రెడ్డి, జి మల్లారెడ్డి , ఎం తిరుపతిరెడ్డి , చందు తదితరులు పాల్గొన్నారు.