Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లోని గోదాంలో ఈవీఎంలను గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. గోదాంలో పనిచేయని ఈవీఎంలను, ఒక బ్యాలెట్ యూనిట్ ను ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమెటెడ్, హైదరాబాదుకు పంపించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టరు డి.శ్రీనివాసరెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధి బట్టు రామచంద్రయ్య, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గిరిధర్, డిప్యూటీ తహశీలుదారు సురేశ్ కుమార్ లు పాల్గొన్నారు.