Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని కోరుతూ ఈనెల 12 నుండి 28 వరకు నిర్వహిస్తున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు అన్నారు.గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ఆలేరు మండలం గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం మొరిగాడి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనమాటా ్లడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి కార్మికులు పోరాడి సాధిస్తున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దుచేసి నాలుగు లేబర్ కోడులను తెచ్చిందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడుల గ్రామ పంచాయతీ సిబ్బందికి కార్మిక చట్టాలు వర్తించకుండా కుట్ర పన్నిందన్నారు. రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో జనగామ జిల్లా పాలకుర్తి నుండి ఈ నెల12 న పాదయాత్ర ప్రారంభమై ఈ నెల 28 నా ఇంద్రాఫార్కులో బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఎట్టి చాకిరి చేయించుకుంటున్నారని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పాదయాత్రలో కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బోడభాగ్య, సీఐటీయూ మండల కన్వీనర్ సంగీరాజు, గ్రామపంచాయతీ కార్మికులు నరసమ్మ ,సుగుణమ్మ ,సాయిలు ,సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.