Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ- ఆలేరురూరల్
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో అఖిలపక్ష పార్టీలతో రౌండ్‌టేబుల్ సమావేశం ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ.ఎగ్బాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధి కొలనుపాక గ్రామంలోని సర్వే నెంబర్ 1646 , 1647 లోని వక్ఫ్ బోర్డ్ భూములను కబ్జా బారి నుండి రక్షించాలని కోరారు.
కొలనుపాక గ్రామంలో భూముల సంబంధించి హైకోర్టు తీర్పు వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా వచ్చినప్పటికీ, హైకోర్టు తీర్పును అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. . ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి కొలనుపాక గ్రామంలోని దాదాపుగా 13 ఎకరాల 38 గంటల భూమిని కబ్జా కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని భూ రక్షణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. టీఎన్జీవో భవన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీపీిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్ధన్ , సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెక్క వెంకటేష్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం వెంకటస్వామి ,మాజీ ఎంపీటీసీ ఎండీ జైనద్దీన్ , సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ధూపటీ వెంకటేష్, అఖిలపక్ష కో కన్వీనర్ ఎండి సలీం, ఆవాజ్ నాయకులు ఎండి సలీం , ఎండి ఇబ్రహీం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌలు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొల్లూరి రాజయ్య ,సీనియర్ పాత్రికేయులు ఎండి.కుర్షిద పాషా, వైఎస్సార్టీపి నాయకులు జానీ మియా, ఆలేరు మస్జీద్ కమిటీ అధ్యక్షులు ఎండి.అజ్మత్ , కమిటీ అధ్యక్షులు సయ్యద్ ,మజార్ రైతు సంఘం నాయకులు ఘనగాని మల్లేష్, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, డీివైఎఫ్‌ఐ ఆలేరు పట్టణ కార్యదర్శి బోనగిరి గణేష్ , పాత్రికేయ మిత్రులు, ముస్లిం మైనారిటీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.