Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
ఆలేరుచ యాదగిరిగుట్ట మున్సిపాలిటీల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి గురువారం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర పురపాలక సంఘం ఐటి శాఖ మంత్రి కేటీఆర్కు వినతి పత్రం అందజేశారు. చేపట్టాల్సిన అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ, వినతిలో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ స్పందించినట్టు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.