Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 13న తలపెట్టిన మాదిగ ఉపకులాల విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి దిగ్భందనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం పట్టణకేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల కన్వీనర్ బోయ లింగస్వామి ఆధ్వర్యంలో సంఘం నాయకులు వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ ప్రధానకార్యదర్శి కోళ్ల శివమాదిగ హాజరై మాట్లాడారు. 25 సంవత్సరాలకుపైగా బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంశానికి మద్ధతు పలుకుతూ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ పిలుపుమేరకు ఈ నెల 13న జాతీయ రహదారి దిగ్భందాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందె కార్తీక్, నల్ల చంద్రస్వామి, జంగయ్య, ఎర్ర శంకర్, బోయ రామచంద్రం, సుక్క అర్జున్, ఊదరి నర్సింహా, ఆరుట్ల లింగస్వామి, బోదుల స్వామి, యాదయ్య, రాజు, బిక్షం, రాజేశ్ పాల్గొన్నారు.