Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రాజాపేట
బీసీల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుటనిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 లక్షల 90వేల 396 కోట్ల బడ్జెట్లో బీసీల సంక్షేమానికి కేవలం 6229 కోట్లు కేటాయించడాన్ని గమనిస్తే రాష్ట్ర జనాభాలో 50 శాతం గల బీసీలకు కేవలం 2 శాతం బడ్జెట్ కేటాయించి బీసీల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45 లక్షల కోట్ల బడ్జెట్లో కూడా బీసీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కేవలం 2 శాతం బడ్జెట్ కేటాయించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే జనగణనలో బీసీల కులగనన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విద్యార్థి, యువజన ,సంక్షేమ సంఘాల నాయకులు ఉపేందర్, శ్రీశైలం, రాజు, రమేష్, ఉమేష్, కర్ణాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.