Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
రోజువారి వ్యాయామంతో శరీరానికి మెరుగైన ఆరోగ్యంతో పాటు, కండరాలపాటుత్వం ఏర్పడుతుందని జెడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్ అన్నారు. పట్టణంలో శుక్రవారం పల్లె సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఫిట్నెస్ జిమ్ కి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీమును సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యాయామం తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఎండి గౌస్ , సీసా నగేష్, పర్రే రమేష్, సుబ్రహ్మణ్యం, శివ పాల్గొన్నారు.