Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని మునిపంపుల గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం స్వపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్య బోధన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ యాదాసు కవిత యాదయ్య మాట్లాడుతూవిద్యార్థి దశలో నిర్వహించే అనేక కార్యక్రమాలు అంశాలు జీవితకాలం మంచి జ్ఞాపకాలుగా నిలిచిపోతాయన్నారు. విద్యార్థులకు విద్యాబోధన తో పాటు సమాజం పట్ల, కుటుంబ పట్ల అవగాహన కల్పించాలన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచి రవికుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు డోగిపర్తి భాస్కర్ ,ఉపాధ్యాయులు కృష్ణయ్య, వనజాత, ఉమా పాల్గొన్నారు.