Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
గర్భిణులు సాధారణ ప్రసవానికి ప్రయత్నం చేయాలని, తద్వారా తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గర్భిణులకు, తల్లులకు సూచించారు. శుక్రవారంమోత్కూరు మండలం బుజిలాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో ఆమె పాల్గొని ఇద్దరు గర్భిణులకు శ్రీమంతం, చిన్నారికి అన్నపాసన కార్యక్రమం నిర్వహించగా, కలెక్టర్ హాజరై మాట్లాడారు. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం అందరి సహకారం కావాలని, ముఖ్యంగా తల్లులు, గర్భిణులకు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. సాధారణ డెలివరీకి ప్రయత్నం చేయాలన్నారు. తద్వారా ఒక మేజర్ శస్త్ర చికిత్సను తప్పించుకుంటే పుట్టిన శిశువుకి ముర్రు పాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, మండల స్పెషల్ ఆఫీసర్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పి.యాదయ్య, సిడిపిఓ జోత్స్న, సూపర్వైజర్ మంగ, అంగన్వాడీ టీచర్లు విజయ, సునీత పాల్గొన్నారు.