Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ రూరల్
ఫిబ్రవరి 17న వలిగొండ మండలంలో చేపట్టే గ్రామ పంచాయతీ సిబ్బంది పాద యాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి తూర్కపల్లి సురేందర్ కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పాద యాత్ర పోస్టర్ ను వెల్వర్తి గ్రామ పంచాయతీ ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులు పొట్ట కొడుతుందన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలుఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్ కు స్పెషల్ స్టేటస్ కల్పిచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీపీ వర్కర్స్ మండలం నాయకులు ఎడవెల్లి ఎలమయ్య, చముడల కిష్టయ్య, స్వామి, పంచాయతీ సిబ్బంది, పాల్గొన్నారు.