Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన దిగుబడులు...ఇండ్ల లోనే పంట నిల్వలు
- ప్రారంభం కానీ సీసీఐ కేంద్రాలు..
- కొనుగోళ్లకు ఊసెత్తని ప్రభుత్వం
పత్తి రైతులు ఏటేటా అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ఈ ఏడాదైనా అప్పులు తీరిపోతాయని గంపెడాశతో ఉన్న రైతులకు ప్రభుత్వం తీరు కారణంగా అప్పులు రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. పత్తి రైతు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాడు. ఈ ఏడాది మరింత దారుణ పరిస్థితిలో కనిపిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడి పూర్తిగా తగ్గింది. పైగా మార్కెట్లో పత్తి పంట అమ్ముకునేందుకు ప్రభుత్వం సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక పత్తి రైతులు తర్జన భర్జన పడుతున్నారు. గత ఏడాది కాస్తో కూస్తో పత్తి కొనుగోలు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది దాని ఊసే ఎత్తడం లేదు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పత్తిని అమ్ముకోలేక దిక్కుతోచని పరిస్థితిలో ఇండ్లలోనే పంటను నిల్వ చేసుకుంటున్నారు. దీంతో పెద్ద ఎత్తున పత్తి పంట ఇండ్లలో పేరుకుపోయాయి..
నవతెలంగాణ -మిర్యాలగూడ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 9.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ధర పెరుగుతుందని ఆశతో రైతులు ప్రతిని ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ఫిబ్రవరి రెండో వారం ప్రారంభమైనప్పటికీ నేటికీ మార్కెట్లో పత్తి కొనుగోలు చేసే వారు కనిపించడం లేదు. ఒకపక్క ప్రభుత్వం కొనుగోలు చేయక.... మరోపక్క బహిరంగ మార్కెట్లో పత్తికి సరైన ధర రాకపోవడంతో పంటలను ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు సరైన ధరతో ఎవరైనా కొనుగోలు చేస్తారని ఆశతో పత్తి రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఇప్పటికైనా స్పందించి పత్తి క్వింటాల్‌కు రూ.12వేలు ప్రకటించి కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 9.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 6.40 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2.25 లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 75 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. నల్లగొండ జిల్లాలో సుమారు 50లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాల్సి ఉండగా ప్రకృతివైపరిత్యాల వల్ల 20వేల-25వేల క్వింటాళ్లకు దిగిబడి తగ్గిపోయింది. గతేడాది ఖరీఫ్‌లో పత్తి దిగుబడి అంతగా రాలేదు. ఈ ఏడాది వరుస వర్షాలతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుత సీజన్లో ఎకరాకు 10 నుంచి 12 గంటల పత్తి దిగుబడి వస్తుందని రైతులు ఆశించగా నాలుగు నుంచి ఐదు క్వింటాల లోపు మాత్రమే దిగుబడి వచ్చింది. పత్తి సాగుకు ఒక్కో ఎకరాకు తక్కువలో తక్కువ 50 వేలకు పైగా ఖర్చు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. కానీ ఈ ఏడాది దిగుబడి విషయానికొస్తే సగటున ఐదు క్వింటాల్‌కు మించలేదని రైతులు చెబుతున్నారు.
2022- 23 పత్తి సీజన్ కు సంబంధించి పత్తి రైతాంగం పై భారీగా భారం పడింది విత్తనాలతో పాటు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో అదనపు భారం పడింది. ఎకరాకు రెండు ప్యాకెట్లు విత్తనాలు విత్తేవారు. ఒక్కో ప్యాకెట్ ధర గత ధర కంటే 43 రూపాయలు పెరగటం వలన రైతులపై అదనపు భారం పడింది. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షల ఎకరాలకు 18 లక్షల ప్యాకెట్లు అవసరమవుతుండగా పెరిగిన ధరల ప్రకారం రైతులపై ఏడు కోట్ల 74 లక్షల అదనపు భారం పడింది. ప్రతి రైతు సగటున ఎకరాకు ఒక బస్తా డిఏపి, రెండు బస్తాలు కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తారు. డీఏపీ బస్తా వంద రూపాయలు కాంప్లెక్స్ ఎరువులపై బస్తాకు 300 రూపాయలు పెరగడంతో రైతులపై సుమారు 27 కోట్ల భారం పడింది. పొటాటో ధర కూడా పెరగడం కారణంగా ఆ భారం కూడా రైతుపై పడింది. పైగా పెరిగిన కూలి రేట్లు, డీజిల్ ధరలు పెరుగుదలతో పెరిగిన దున్నకం రేట్లు తోడవ్వడంతో పత్తిని కొనుగోలు చేయకపోవడంతో రైతులకు నష్టాలు పెరిగిపోయాయి.
ప్రారంభం కానీ సిసిఐ.... బహిరంగ మార్కెట్లో కొనుగోలు కరువు
పత్తి రైతులు పరిస్థితి ఆడ కత్తెరలో పోక చెక్కలా మారిపోయింది. గత రెండు సీజన్లుగా ప్రభుత్వం మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో పత్తి ధర ఎక్కువగా వచ్చింది. దీంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల కంటే బహిరంగ మార్కెట్లోనే రైతులు పత్తి అమ్ముతూ వచ్చారు. అదేవిధంగా ఈసారి ప్రభుత్వం మద్దతు ధర క్వింటాలుకు 6,380 నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో కింటాల్కు రూ.9000కు పైగా ధర పలుకుతుండడంతో సీసీఐ కొనుగోలు చేపట్టలేదు. గతంలో ఉమ్మడి జిల్లాలోని 26 జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోళ్లు నిర్వహించింది. ఈ సీజన్లో దిగుబడి తక్కువగా ఉండటం, బహిరంగ మార్కెట్లో ధర అధికంగా ఉండడంతో సీసీిఐ కొనుగోలు ప్రారంభించలేదు. ఇదే అదునుగా దళారులు బహిరంగ మార్కెట్లో ధరను 7వేలకు తగ్గించేశారు. నిజానికి ధర పెరుగుతుందని ఆశతో రైతులు పత్తిని ఇండ్లలోనే నిల్వ చేసుకున్నారు. కానీ ఫిబ్రవరి రెండో వారం ముగిస్తున్నా కొనుగోలు లేకపోవడంతో పత్తి ఇండ్లలోనే నిల్వ పేరుకుపోయాయి. ఒకవైపు ప్రభుత్వం కొనుగోలు చేయక మరోవైపు బహిరంగ మార్కెట్లో ధర లేక పోవడంతో పత్తిని అమ్ముకునేందుకు రైతు ఎదురుచూపూలు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పత్తి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
పత్తి క్వింటాకు రూ.12వేలివ్వాలి
చాపల శ్రీకాంత్ యాదవ్ (లెంకలపల్లి), మర్రిగూడ
నేను పది ఎకరాలలో పత్తి సాగు చేశాను. వర్షాల ప్రభావంతో గత సంవత్సరం కంటే ఈ ఏడాది దిగుబడి శాతం తగ్గింది. దానికి తోడు పెట్టుబడి ఖర్చులు కూడా విపరీతంగా వస్తున్నాయి. ప్రభుత్వం క్వింటా పత్తి పదివేలుగా నిర్దిష్టమైన ధరను నిర్ణయించి కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలి.
క్వింటాలుకు 12,000 మద్దతు ధర ప్రకటించాలి
వీరపల్లి వెంకటేశ్వర్లు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు
పత్తి పంటకు క్వింటాల్‌కు 12 వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలి. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పత్తి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పైగా పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. క్వింటాలుకు 12 వేల రూపాయలు మద్దతు ఇస్తే తప్ప రైతులకు పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వం గంటలు 12 వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలి. కౌలు రైతులను కూడా ఆదుకోవాలి. రైతుల వద్ద ఉన్న పత్తి మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అందుకుగాను వెంటనే సిసిఐ కేంద్రాలు ప్రారంభించాలి.
ఎక్కువ ధర కోసం రైతులు ఎదురుచూస్తున్నారు
మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్
జిల్లాలో పత్తి సాగు జరిగినప్పటికీ ఆశించిన మెరుగు దిగుబడి రాలేదు. పైగా పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగాయి. గత సంవత్సరం పత్తి కింటాలుకు 9000 పైకి చిలుకు ధర పలికింది. ఇప్పుడు 7000 రూపాయలు మాత్రమే ధర వస్తుంది. ప్రభుత్వం 6,380 మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్ కంటే మద్దతు ధర తక్కువగా ఉండడం వల్ల సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ధర తక్కువగా వస్తున్నాడంవల్ల రైతులు పత్తిని విక్రయించడం లేదు. పెట్టిన పెట్టుబడులు వెళ్లాలని గతంలో మాదిరిగా ధర పలకాలని రైతులు ఎదురుచూస్తున్నారు.