Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పంచాయితీ పాదయాత్ర పేరుతో ఈ నెల 12 నుండి 28వ తేది వరకు గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అద్యక్షుడు పాలడుగు భాస్కర్ పాదయాత్ర చేస్తున్నారని ఈయాత్రతో ప్రభుత్వం దిగి రావాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు తెలిపారు.శుక్రవారం మండలకేంద్రంలో గ్రామపంచాయితీ కార్మికుల చేత పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈయాత్ర జనగామ జిల్లా పాలకుర్తి గ్రామం నుండి ప్రారంభించి హైదరాబాద్న ఈ నెల 28 న ఇందిరా పార్క్ వద్ద బారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. గ్రామస్థాయిలో అతితక్కువ వేతనానికి అతిహీనమైన పని చేసే గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ పోరాట ఫలితంగా పెంచిన 8500 రూపాయల వేతనం ఇచ్చినట్లే ఇచ్చి కార్మికులకు గొడ్డలి పెట్టుగా ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.దీంతో ఓకే కార్మికుడు అన్ని పనులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని వాపోయారు. సమయపాలన లేక ఆత్మగౌరవం చంపుకొని రాజకీయా వేధింపులు తట్టుకోలేక గ్రామ పంచాయతీ కార్మికులు కుటుంబం కోసం చావుకు తెగబడి పని చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలుఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రతి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వారందర్నీ పర్మినెంట్ చేయాలని డిమాండ్స్‌తో పాలడుగు భాస్కర్ సారథ్యంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గ్యారపాండు, ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, వర్కింగ్ ప్రెసిడంట్ గణపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు తునికి మహేష్, వినోద్‌కుమార్ బృందంగా తెలంగాణ సాయుధ పోరాట యోధరాలు వీరనారి చిట్యాల అయిలమ్మ స్వగ్రామం పాలకుర్తి నుండి హైదరాబాద్ వరకు పాద యాత్ర కొనసాగి సభ జరుగుతుందన్నారు.ఈ యాత్రలో వేలాది మంది పాల్గొని 28 తేదిన ఇందిరాపార్కు సభలో వేలాది మంది గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ మండల నాయకులు రాంబాబు, వెంకయ్య, పుల్లమ్మ, గుర్వమ్మ పాల్గొన్నారు.