Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలుకూరు
నేటి యువత రాబోవు తరాలకు ఆదర్శంగా నిలవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి అన్నారు.ఆనాడు యువకులుగా ఉండి చేసిన త్యాగాల ఫలితం మూలంగానే మనం ప్రయాణం చేస్తున్నామన్నారు.ఈ క్రమంలోనే నేటి యువకులు వేసిన బాటలోనే రాబోవు యువకులు ముందుంటారన్నారు.శుక్రవారం మండలంలోని బేతవోలు గ్రామంలో కనకదుర్గమ్మ జాతరకు హాజరై మాట్లాడారు.యువకులు జాతరను వైభవంగా నిర్వహించడం హర్శించదగ్గ విషయమన్నారు.కనకదుర్గమ్మ దీవెనలతో గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలన్నారు.ప్రధానమంత్రి మోడీ అవలంబిస్తున్న విధానాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలన్నారు.లేనిపక్షంలో రాబోవు తరాలకు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మిట్టగనుపుల ముత్యాలు, జే నర్సింహారావు, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగాటి చినరాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నారసాని వెంకటేశ్వర్లు, బత్తిని వెంకటయ్య, ఎగ్గడి లింగయ్య, పిల్లి వీరమల్లు, మైలారిశెట్టి లింగయ్య, గట్టు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.