Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలువ నీడ లేక ప్రయాణికుల అవస్థలు
నవతెలంగాణ- బీబీనగర్
నిలువ నీడ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు, ఇది ఏదో మారుమూల ప్రాంతంలో కాదు, రాష్ట్ర రాజధానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా బీబీనగర్ పట్టణం. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి టోల్ ప్లాజా నిర్వాహకులు బస్సు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్టాండ్ ఇది, 15 రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తుతెలియని లారీ అతివేగంగా బస్టాండ్‌ను ఢ కొట్టడంతో బస్టాండ్ పూర్తిగా నేలమట్టం అయింది, అదృష్టవశాత్తు ఏలాంటి ప్రాణఃనష్టం జరగలేదు. కానీ బస్టాండ్ ఢకొీట్టిన లారీ మాత్రం తెలవరేసరికి టోల్ నిర్వాహకులు, పోలీసుల సహకారంతో అక్కడినుంచి తరలి వెళ్లింది. బస్టాండ్ మాత్రం అలాగే నేలమటమై ఉంది, నిత్యం సామాన్య ప్రజలు బస్సు ప్రయాణం కోసం బస్టాండ్ కు వస్తు ఉంటారు, కానీ ఇప్పుడు ప్రయాణికులు కనీసం కూర్చోవడానికి కానీ నిలుచోవడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొన్నది. జాతీయ రహదారిపై నిత్యం రాష్ట్ర రాజధాని నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనార్థమై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, రాకపోకలు సాగిస్తూ ఉంటారు కానీ వారు దృష్టి మాత్రం సామాన్య ప్రజలకు కోసం ఏర్పాటు చేసిన బస్టాండ్ పై పడకపోవడం దురదృష్టకరం, ఇకనైనా సంబందిత అధికారులు తక్షణమే బస్టాండ్‌ను పునఃనిర్మించాలని ప్రజలు కోరుతున్నారు, లేనిచో రానున్న వేసవి కాలంలో ప్రయాణికుల అవస్థలు చెప్పలేని స్థితిలో ఉంటాయని ఆవేదన చెందుతున్నారు.