Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట పట్టణంతోపాటు ఆలేరు నియోజకవర్గం అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు దిగుతున్నారని బీఆర్ఎస్ పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కెసిఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఆలేర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపజేసి స్థానిక ఎమ్మెల్యే ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులు కనబడడం లేద అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పులిహోర తిన్నారు తప్ప నరసింహస్వామికి ఏమి చేయలేదన్నారు. టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే ఆలోచన వారికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.ఈ సమావేశంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ బాబా,నాయకులు గౌటి సదానందం,బూడిది స్వామి ,మోత్కుపల్లి బిక్షపతి ,మోత్కుపల్లి భాస్కర్ ,పులిగిల్ల గిరి పాల్గొన్నారు.