Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసన సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు విమర్శించే నైతిక స్థాయి లేదని మున్సిపల్చైర్మెన్ వస్పరి శంకరయ్య అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేలకోట్ల రూపాయలతో యాదాద్రి అభివృద్ధి జరిగితే జీర్ణించుకోలేకనే కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో అత్యున్నత దేవస్థానంగా యాదాద్రి అభివృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ నాయకులు కళ్ళు లేని కభోధిలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆటో కార్మికులకు, రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన బాధితులకు తొందర్లో ఎమ్మెల్యే శుభవార్త తెలియజేస్తారని చెప్పారు.మరోసారి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ , పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటేష్, మార్కెట్ వైస్ చైర్మెన్ గ్యాద పాక నాగరాజు,జిల్లా గ్రంథాలయం బాలస్వామి , పిఎసిఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశం, యూత్ అధ్యక్షులు పూల శ్రావణ్, జల్లి నరసింహులు, ముదిగొండ శ్రీకాంత్ ,చిమ్మి శివ మల్లు ,కార్యకర్తలు పాల్గొన్నారు.