Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు, ప్రసిద్ధ కవి, విమర్శకులు, గాయకులు, డా. బెల్లి యాదయ్య పాలపిట్ట తెలుగు జాతీయ సాహిత్య మాసపత్రిక, విమల సాహితీ సంస్థలు సంయుక్తంగా దీపావళి సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీలో డా.బెల్లి యాదయ్య రాసిన నది పిలుస్తున్నది కవిత తృతీయ బహుమతికి ఎంపిక కావడంతో హైదరాబాదులోని త్యాగరాయ గానసభ లో నిర్వహించిన సమావేశంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నిఖిలేశ్వర్ డా.బెల్లి యాదయ్యకు విమల సాహితీ- పాలపిట్ట జాషువా స్మారక కవితా పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బెల్లి యాదయ్య మూసీనదితో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ 'నది పిలుస్తన్నది' కవితను సభికులకు వినిపించారు. ప్రసిద్ధ సాహిత్య వేత్త, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డా.ఏనుగు నర్సింహా రెడ్డి నది పిలుస్తున్నది కవితా విశేషాలను సభలో ప్రత్యేకంగా వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస రెడ్డి, ఏఓ మంజర్ జాఫ్రి, అధ్యాపకులు మక్లా, శ్రీకాంత్, డా.యాదగిరి, ఇందిర, మధు, బాలనర్సింహ, రమాదేవి, డా.తుల్జా భవాని, కిషన్, అనిత, సరిత తదితరులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థుల కమిటీ, కళాశాల అభివృద్ధి కమిటీ, విద్యార్థులు, స్థానిక సాహిత్యాభిమానులు ఆయన అభినందనలు తెలిపారు.