Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరు రూరల్
గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు చెల్లించాలని సీఐటీయూ మండల కన్వీనర్ మురిగాడి రమేష్ అన్నారు. శనివారం ఆలేరు మండలంలోని శరాజి పేట గ్రామంలో గ్రామపంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసం జరుగుతున్న పాదయాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ నెల 12న జనగాం జిల్లా పాలకుర్తి నుండి సీఐటీయూ పాదయాత్ర ప్రారంభమవుతుం దన్నారు. ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు నామమాత్రంగా జీతాలు పెంచి వివిధ కేటగిరిలను రద్దుచేసి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకొచ్చారు . కారోబార్, బిల్ కలెక్టర్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా. జీవో నెంబర్ 51 తీసుకుని రావడం వల్ల కారోబార్ తో మల్టీపర్పస్ వర్కర్ విధానం ప్రజా ప్రతినిధుల ఇండ్లలో వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటున్నారని అన్నారు. ఈ నెల 15న జనగాం జిల్లా నుండి పెంబర్తి నుండి జిల్లాకు వస్తుందని ఈనెల 28న హైదరాబాద్ ఇందిరా పార్కులో కార్మికులు ఆధ్వర్యంలో పెద్ద బహిరంగ సభ ఉంటుందని అన్నారు .ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు.సంగి రాజు, గ్యాదపాక రమేష్, పుట్టలమహేందర్, పుట్టల లక్ష్మి,పుట్టల నర్సమ్మ, కందుల పుష్ప తదితర కార్మికులు పాల్గొన్నారు.