Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
సాగర్ నీరందకపోవడంతో పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని, ఈసారి పంట చేతికి వస్తుందో రాధమోనని ఆందోళన చెందుతున్నామని అనంతగిరి మండలం ఖానాపురం, లక్ష్మీపురం రైతుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఖానాపురం గ్రామంలోని సర్వే నెంబర్ 50/39 లో గల సుమారు 45 ఎకరాలు పంట పొలాలు పూర్తిగా నీరందక ఎండిపోతున్నాయన్నారు.సాగర్ ఎడమకాలువ నీటిని కొద్ది మోతాదులో వదిలినప్పటికీ నడిగూడెం మండలకేంద్రంలో కాలువ మరమ్మతుల వలన చివరిపంట పొలాల వరకు చేరుకోకపోవడంతో పంటలు ఎండుతున్నాయన్నారు.ఇదే విషయమై సంబంధిత ఎన్నెస్పీ ఏఈని ఫోన్ ద్వారా రైతులు సంప్రదించినప్పటికీ స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చొరవ తీసుకొని పంట పొలాలకు నీరందేలా చూడాలని స్థానిక రైతుల వేడుకుంటున్నారు.