Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
అర్హులైన పేదలందరికీ ఇండ్లు, స్థలాలు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం అమరవీరుల స్మారక భవనంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇండ్లు, స్థలాలు డబుల్బెడ్రూమ్ ఇండ్ల కోసం మండలవ్యాప్తంగా నాలుగేండ్లుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వం అధికారులు నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహరి స్తున్నారని విమర్శించారు.మండలంలోని బూరుగడ్డ (మాసారం) గ్రామంలో డబుల్బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదని విమర్శించారు.సీతారామాపురంలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు.ఇండ్ల స్థలాలకు వెంటనే పట్టాలిచ్చి పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు.సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం డబ్బులు ఇస్తామని ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటి స్థలం ఉన్న వారికి రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించారన్నారు.ప్రభుత్వం తక్షణమే పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు చింత కుంట్ల వీరయ్య, నూకల లక్ష్మీనర్సింహ, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, చందాలభిక్షం, షేక్ ఖాశీం, సిద్ధిల వెంకటయ్య పాల్గొన్నారు.