Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు
నవతెలంగాణ-సూర్యాపేట
ఉద్యోగ ఉపాధ్యాయుల నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్.రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడారు.అలాగే నూతన విద్యా విధానాన్ని రద్దుచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ రెండు అంశాలని రద్దు చేయాలని ఫిబ్రవరి 24 తేదీన ఎస్టీఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగే చలో పార్లమెంట్ (ఢిల్లీ)ను విజయవంతం చేయాలని ఆయన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.పాఠశాలలో స్కావెంజర్లను నియ మించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్.సోమయ్య, ప్రధానకార్యదర్శి ఎస్.అనిల్ కుమార్,పి.శ్రీనివాస్‌రెడ్డి,కె.అరుణభారతి,జి.వెంకటయ్య,ఎస్. కే.సయ్యద్, సీహెచ్.వీరారెడ్డి, బి.పాపిరెడ్డి, వి.రమేష్, బి.ఆడమ్, పి.అనిల్‌కుమార్,టీఏ జనార్దన్‌రావు, చిలక రమేశ్, జె.క్రాంతిప్రభ, డి.శ్రీని వాసాచారి, డి.లాలు, రాంపల్లిశ్రీను, రమావత్ రమేష్,ఏలే.శీనయ్య, ఎన్.సైదా, డి.బాలాజీ, సుంకరి.అనిత, బి.అక్కయ్యబాబు, దామళ్ల. నరేందర్, బి.పిచ్చయ్య, ఎం.రవీందర్, బండ్ల.రమేష్,రాంజి పాల్గొన్నారు.