Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లునాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మోతె
కీలుకాని ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపు నిచ్చారు.శనివారం మండలపరిధిలోని లాల్‌తండా ఆవాసం కీలుకానినగర్లో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన పదో వర్థంతి నిర్వహించారు ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడారు.ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో సిరికొండ గ్రామం ప్రముఖ పాత్ర పోషించిందన్నారు.ఆ గ్రామంలో పుట్టిన సోమయ్య పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు.తన జీవితాంతం ఈ ప్రాంతంలో రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నీతి,నిజాయతీగా పని చేశారని కొనియాడారు.అనేక కష్టనష్టాలు, దాడులు, నిర్బంధాలు ఎదుర్కొన్నా చివరి వరకు పార్టీలో కొనసాగుతూ ఎంతో కృషి చేశారన్నారు.నేటి వరకు ఆయన వారసత్వాన్ని యువత ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు.దేశ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఐక్యంగాఉన్న దేశ ప్రజల మధ్య మతవిధ్వంసాలను రెచ్చగొడుతూ దేశ ఐక్యతకు భంగం కలిగిస్తుందని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆటలకు అడ్డుకట్ట వేసే శక్తి కమ్యూనిస్టులకు మాత్రమే ఉందన్నారు.అంతకుముందు సోమయ్య స్మారక స్థూపానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సోమయ్య జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, సోమయ్య కుమారుడు పార్టీ మేడ్చెర్ల జిల్లా కమిటీ సభ్యులు కీలుకాని లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు జై.నర్సింహారావు, మండల కార్యదర్శి ఎం.గోపాల్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు కంపాటి శ్రీను,కిన్నెర పోతయ్య, కె.సత్య నారాయణ,నాగ మల్లయ్య, గుంటగాని ఏసు ,బూడిద లింగయ్య, రేపాల వెంకన్న,లాల్‌తండా మాజీ సర్పంచ్ గౌని రమణ,గోపాల్, లాల్‌తండా ఎంపీటీసీ లలితా భాస్కర్,బి. ఝాన్సీబాబు నాయక్,బీఆర్ఎస్ ఎస్టీసెల్ మండల అధ్యక్షులు బానోతు దేవ్లా, బీఆర్ఎస్ మండల నాయకులు కీలుకాని వెంకన్న, సోమయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.