Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండ రూరల్
పులిగిల్ల గ్రామపంచాయతీ పరిధిలో మధిర గ్రామంగా ఉన్న గోలిగూడెంను నూతన గ్రామపంచా యతీగా ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకటరెడ్డి, బుగ్గ చంద్రమౌళి డిమాండ్ చేశారు.ఆదివారం గోలిగూడెం గ్రామంలో ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని తెలిపారు. ప్రజలు గోలిగూడెంను నూతన గ్రామపం చాయతీ చేయాలని డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలన్నారు .గ్రామంలో అన్ని వార్డుల్లో సీసీరోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గోలిగూడెం నుండి కంచనపల్లి వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.గోలిగూడెం గ్రామంలో కూరగాయలను సాగు చేస్తున్న రైతాంగానికి అన్ని రకాల నాణ్యమైన సబ్సిడీ విత్తనాలను అందించాలని కోరారు.వలిగొండ నుండి సుంకిశాల వరకు అధ్వానమైన బీటీరోడ్డుపై వెంటనే నూతన రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, సీపీఐ(ఎం) నాయకులు, మాజీ ఉపసర్పంచ్ కొంతం తిరుమల్‌రెడ్డి, మారబోయిన నర్సింహ, నర్సింహారెడ్డి, మన్నెంయాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.