Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగిసిపడుతున్న మంటలు
- ముగ్గురికి స్వల్పగాయాలు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని ఎస్వీఆర్ రసాయన పరిశ్రమలో ఆదివారం సాల్వెంట్‌ను రీసైక్లింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది.దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయిజదీంతో కంపెనీలో ఏం జరిగిందో ఎవరికి తెలియకపోవడంతో కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీశారు.ఆ బ్లాక్‌లో ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది.అగ్నిమాపక సిబ్బంది కంపెనీకి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, ముగ్గురు కార్మికులకు స్వల్పగాయాలయ్యాయని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.మండలపరిధిలోని దోతిగూడెం, అత్తమ్మగూడెంగ్రామ పరిధిలో పదుల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఉండగా వాటిల్లో వందల సంఖ్యలో కార్మికులు పనిచేస్తుంటారు.పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు పరుగులు తీశారు.గతంలో పరిశ్రమలలో ఏదో ఒక కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీ యజమాన్యాలు భద్రత కల్పించకపోవడం బాధాకరమైన విషయమని పలువురు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు ప్రమాదాలు జరుగుతున్నప్పుడే హడావుడి చేస్తారు.తర్వాత కంపెనీల గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.పరిశ్రమల యజమానులు కార్మికులను ఇతర రాష్ట్రాల నుండి పనులలో పెట్టుకోవడం వారికి ఏమన్నా ప్రమాదం జరిగినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పంపిస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి.పరిశ్రమల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలను గుప్పట్లు పెట్టుకొని కాలమెళ్లదీస్తున్నట్టు సమాచారం.