Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఆరోగ్య తెలంగాణ కావాలంటే మనందరం గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించుకోవాలని టెస్కాబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని సుద్దాల గ్రామంలో మహేంద్ర యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ సీనియర్స్ విభాగంలో ఎస్ఆర్ యూత్ మాసాన్‌పల్లికి రూ.25 వేలు, షీల్డ్ ద్వితీయస్థానంలో సీతారాంపురం గ్రామానికి 15వేల రూపాయలు, షీల్డ్ జూనియర్స్ విభాగంలో ప్రథమ,ద్వితీయ స్థానంలో జెడ్పీహెచ్ఎస్ గూడూరు,జెడ్పీహెచ్ఎస్ సీతారాంపురం కబడ్డీపోటీలలో ప్రథమ బహుమతి మసీదు యువసేన,ద్వితీయ బహుమతి హనుమాన్ గల్లీ సుద్దాల జట్లకు ఆయన చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటమలు సహజమని ఓడిన జట్లు నిరుత్సాహం చెందకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు .యువకులు,విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో క్రీడలు నిర్వహించుకోడం అభినందనీయమన్నారు.ఈకార్యక్రమంలో సర్పంచ్, మాజీ జెడ్పీ వైస్‌చైర్మెన్ గడ్డమీది పాండరి గౌడ్, ఎస్ఐ డి.యాకన్న, సర్పంచ్, ఎంపీటీసీలఫోరం మండల అధ్యక్షులు దార సైదులు,బొంగు శ్రీశైలంయాదవ్,నాయకులు చిందం ప్రకాష్,బండారి శ్రీనివాస్,మద్దుల బాల్‌రెడ్డి,మొగిలిపాక రవి,మొగులాల్, నిర్వహణ కమిటీ సభ్యులు మహోదరుగౌడ్, వేణుగోపాల్ రెడ్డి, మహేష్, రమేష్, శ్యాంసుందర్‌రెడ్డి, రాజు, నరేష్,మధు తదితరులు పాల్గొన్నారు.