Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
రాజీమార్గమే రాజమార్గమని ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సూరసుమలత అన్నారు.ఆదివారం మండల కంద్రంలో కోర్టు ఆవరణలో కక్షిదారులను ఉద్దేశించిన మాట్లాడారు.క్షణికావేశంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న వారికి న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు కల్పించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.దేశంలో అన్ని కోర్టులలో పెరుగుతున్న కేసులను తగ్గించేందుకు లోకదాలత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు.పరిష్కరించదగిన కేసులను, ఇరు వర్గాల సమ్మతి మేరకు కేసును తొలగించడం జరుగుతుందని చెప్పారు. పైకోర్టులో అప్పిలుకు అవకాశముండదన్నారు.కక్షిదారులు ఏండ్లకేళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపనతో పాటు, ఆర్థికంగా వారికి నష్టం జరగదని వివరించారు.కోపతాపాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కక్షబూనే బదులు రాజీపడి సంతోషంగా ఒకరినొకరు పలకరించుకునే అవకాశం కలిగించడమే లోక్ అదాలత్ ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధగని శ్రీహరి, న్యాయవాదులు సీస శ్రీనివాస్, వంగరి శివకుమార్, కేవీప్రసాద్, హరికృష్ణ, రావుల రవీందర్రెడ్డి, సాయికృష్ణ, సంతోష, రవికుమార్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.