Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ పట్టదాలతో అంకితభావంతో విద్యనాభ్యసించాలని పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య అన్నారు.మండలకేంద్రంలో ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పట్టణంలోని వీఆర్ జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ విద్యార్థి దశ నుండే క్రమశిక్షణ పట్టుదల అంకితభావంతో విద్యపై శ్రద్ధ పెట్టి చదివితే జీవితంలో స్థిరపడవచ్చ న్నారు.దేశానికి, ఊరికి సేవ చేయవచ్చన్నారు.పరీక్షల పట్ల ఉండే ఆందోళన దూరం చేసే విధంగా వారిలో నైపుణ్యం పెంచే విధంగా ఎస్ఎఫ్ఐ పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో టీఆర్టీపీఏ జిల్లా జనరల్ సెక్రెటరీ,యూటీఎఫ్ సీనియర్ నాయకులు బొమ్మకంటి బాలరాజు, కందుల నాగరాజు, కంతివిక్రమ్, ఆదె సుర్జిత్, వడ్డెమాను విప్లవ్ పాల్గొన్నారు.
వలిగొండ : శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలు అంటే భయాన్ని విడిచి రానున్న పరీక్షలో మంచి మార్కులు సాధించాలన్నారు.పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు చాలా ఉత్సాహంగా 200 మంది విద్యార్థుల వరకు వలిగొండ పట్టణంలో పాల్గొని విజయవంతంగా ముగిశాయన్నారు. విద్యార్థులలో ఉన్న భయాన్ని బయటకు తోలేందుకు ఇలాంటి టాలెంట్టెస్ట్లు ఉపయోగపడుతాయన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు మండలఉపాధ్యక్షులు వేముల జ్యోతిబాస్, సహాయకార్యదర్శి పోలేపాకవిష్ణు, గర్ల్స్ కన్వీనర్ నేహా, సందెల దుర్గాప్రసాద్, నాయకులు వేములకొండ వంశీ, భాస్కర్, బత్తిని మణికంఠ,రంజిత్, రాకేష్,ఫర్దిన్, ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్: పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షకు ముందుగా ప్రతి ఏటా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే టాలెంట్టెస్ట్ను మండలకేంద్రంలోని కిడ్స్కింగ్డమ్ హైస్కూల్ ఆవరణలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు పవన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందెల రాజేష్ ఆధ్వర్యంల నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాయకులు భగత్, శివ,నర్సింహ, ఉపాధ్యాయులు శేఖర్, దినేష్, తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి : విద్యార్థులంతా ఈ పోటీ ప్రపంచంలో ఒత్తిడి లేకుండా ఇష్టపడి పరీక్షలు రాసి వారి యొక్క లక్ష్యాలను సాధించాలని భువనగిరి పట్టణ ఎస్సై కృష్ణయ్య అన్నారు.భువనగిరి పట్టణంలో ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్‌ను స్థానిక మదర్‌థెరిస్సా హైస్కూల్లో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య, జిల్లా కార్యదర్శి సంగు వనిత, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనంరాజు, మదర్‌థెరిస్సా స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఈర్ల రాహుల్ చింతల శివ, ఎస్ఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఎండి నేహాల్, ఎండి రెహాన్, నేలిగొండ సాయి, తుక్కాపూర్ గణేష్, బీరకాయల ప్రణరు పాల్గొన్నారు.
గుండాల : మండలంలోని ఆదర్శ పాఠశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10 వ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుర్రు అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులకు భయపడకుండా రానున్న రోజుల్లో విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు.కార్యక్రమంలో 70 మంది విద్యార్థులు చాలా ఉత్సహంగా పాల్గొని విజయవంతం చేశారన్నారు.ఈకార్యక్రమంలో నాయకులు ప్రేమ్‌కుమార్, పాఠశాల ఉపాధ్యాయుడు దశరథ తదితరులు పాల్గొన్నారు.