Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
విద్యార్థి దశలోని బాల్య జీవితపు ఆనందాలు, తోటి విద్యార్థులతో ఆడిన ఆటలు, పాటలు, నాటి ఉపాధ్యాయుల బోధన అంశాలు సంతృప్తికరమైన, బాధ్యతాయుతమైన బావిజీవితానికి ఆనందపు మార్గాలు వేస్తాయని ప్రముఖ సహితివేత, కవి డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య అన్నారు.ఆదివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల1990- 1991 సంవత్సరపు ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్దుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని తమ అనుభూతులను పంచుకొని, యోగక్షేమాలను తెలుసుకు న్నారు.ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులు తవుటం భిక్షపతి, అచ్చితరెడ్డి, యాదగిరి, జనార్దన్‌రెడ్డిలను శాలువా కప్పి, పూలమాలలేసి ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఆత్మీయంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, పూర్వవిద్యార్థులు ఘనతల భాస్కర్‌రెడ్డి, పి.మల్లేష్‌గౌడ్, కె.మంజుల, ఎం.అరుణ, ఎం.శ్రీనివాసరావు, జే.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.