Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి విధిస్తున్న విద్యుత్ కోతను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 13, 14వ తేదీలలో జిల్లావ్యాప్తంగా సబ్స్టేషన్ల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లావ్యాప్తంగా కొంతకాలంగా వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ కోత విధించడం మూలంగా లక్షలాది ఎకరాల వరి పంట తీవ్రంగా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే విద్యుత్ కోతలను నివారించి 24 గంటలు వ్యవసాయానికి విద్యుత్ అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 13 ,14వ తేదీలలో జిల్లావ్యాప్తంగా ఉన్న సబ్ స్టేషన్ ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,మట్టిపల్లిసైదులు, మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.