Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పిలుపు మేరకు సూర్యాపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ పిట్ట రాంరెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని, తిరుమలగిరి గ్రామ సబ్స్టేషన్ ముందు రైతులతో కలిసి ఆ పార్టీ ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు మూగ వెంకట్రాంరెడ్డి మాట్లాడారు.కోతలు లేని 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాటతప్పి ఇప్పుడు దశలవారీగా ఏడుగంటల విద్యుత్ ఇవ్వడంతో రైతులు ఇబ్బందుల పాలు పడుతు న్నారన్నారు. సమయపాలన లేకపోవడంతో ఎన్నో ఇక్కట్లకు గురవు తామన్నారు.ఈ కార్యక్రమంలో గోరంట్ల సంజీవ్, రాఘవరెడ్డి, నెమ్మాది మల్సూర్, ఎండీ రఫీ, సరిత, అంజి, సురేష్, గోపిరెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పెన్పహాడ్ : రైతులకు 24 గంటల కరెంటు అందచేయాలని వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్. షర్మిల ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి సూచనల మేరకు మండల కేంద్రంలోని సబ్ స్టేషన్లో రైతులతో కలిసి ఆ పార్టీ మండల అధ్యక్షుడు తాడోజు జనార్ధనచారి ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్ధనచారి మాట్లాడుతూ కరెంటు మంత్రి నియోజకవర్గంలో రైతులకు 24 గంటల కరెంటు కరువైందన్నారు. ఈ కార్యక్రమం ఆ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బచ్చలకురి రవికుమార్, నాయకులు మామిడి పరశురాంగౌడ్, మేకల సైదులు, సురేష్ నాగయ్య, హుస్సేన్, రాములు తదితరులు పాల్గొన్నారు.