Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఎనిమిదేండ్లుగా పార్లమెంట్ ద్వారా చట్టబద్దత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవ్వడాన్ని నిరసిస్తూ ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయరహదారిని దిగ్బంధం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతిమాదిగ, ఎంఎస్పీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ మాట్లాడారు.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తున్న బీజేపీకి చెబుతామని హెచ్చరించారు.వచ్చే ఎన్నికలలో తగిన విధంగా తమ రాజకీయ కార్యచరణ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉంటుందని హెచ్చరించారు. దిగ్బంధం చేయడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈకార్యక్రమంలో దుప్పెల్లి అనిల్కుమార్మాదిగ, తెలంగాణ శాగంటి రమేష్మాదిగ, ఎంఎస్పీ నియోజకవర్గ నాయకులు వడ్డేపల్లి రామకృష్ణ, పిడమర్తి వెంకట్రావు మాదిగ, పట్టణ అధ్యక్షుడు కుడుముల శ్రీను, పట్టణ ఉపా ధ్యక్షుడు ఏపూరి సత్యరాజు, పట్టణ నాయకులు సోమపంగు సురేష్,సోమపంగు నరేష్, గణపవరం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు పిడమర్తి సతీష్, బల్గూరి రోశయ్య, పోలేపక ఎల్లయ్య ,తదితరులు పాల్గొన్నారు.