Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
మహాశివరాత్రి వేడుకలను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో పిల్లలమర్రి శివాలయాల మహా శివరాత్రి గోడ పత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.కాకతీయుల నాటి శివాలయాల్లో జరిగే వేడుకలను సమన్వయంతో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు.భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఏర్పాట్లు చేయాలని మున్సిపల్, ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ చైర్మెన్ జెర్రిపోతుల భిక్షం, కౌన్సిలర్ బచ్చలికూర శ్రీనివాస్, నాయకులు సోమగాని లింగస్వామి, రాపర్తి శ్రీనివాస్, బంగారి శ్రీనివాస్, రాపర్తి మహేష్, ఒబల్లోజు శంకర్,కుమ్మరికుంట్ల నాగరాజు, జెర్రిపోతుల నరేందర్,డైరెక్టర్లు చెరుకుపల్లి ఉపేందర్, సట్టుసాయి, బంగారి నరేష్, ఉల్లెందుల సైదులు, కాంశెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు.