Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఆధాని మీద మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయనాయుడు డిమాండ్ చేశారు.ఈ విషయమై సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బీఐ ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆధానికి ప్రభుత్వ రంగసంస్థలను కట్టబెడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తుందని విమర్శించారు.అందువల్ల ఆధానిపై మనీల్యాండరింగ్ కేసులు నమోదు చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎల్లబోయిన సింహాద్రి, పట్టణ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను,అంబటి భిక్షం, ఏఐటీయూసీ నాయకులు గైగుళ్ల శ్రీరాములు అయిల నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ నాయకులు రేఖ ఉపేందర్,పాల్వాయి నాగయ్య, ఎస్.వసంతరావు, ఎన్.సైదులు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.