Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
పేదలకు కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన సురేష్ ఆర్థోపెడిక్ వైద్యశాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.జాతీయ రహదారిపై ఉన్న నియోజకవర్గంలో పలు గ్రామాల ప్రజలు ప్రమాదాల గురై ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలలకు వస్తున్నారన్నారు.అటువంటి క్షతగాత్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి వారి ప్రాణాలు కాపాడాలన్నారు. దేవుడు జన్మనిస్తే ప్రాణాలు కాపాడే దేవుళ్ళు భూమిపై డాక్టర్లని వైద్యుల సేవలు ఎనలేనివి అని కొనియాడారు. ఈ సందర్భంగా వైద్యశాల యజమాన్యం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చింత కవితరాధారెడ్డి, డాక్టర్ సురేష్, డాక్టర్ ప్రమీల శ్రీపతిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పైడిమర్రి సత్యబాబు, తుమ్మలపల్లి భాస్కర్, కాటంరెడ్డి ప్రసాద్‌రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, కందుల కోటేశ్వరరావు, గుండెల సూర్యనారాయణ, డాక్టర్ బ్రహ్మం, సాదిక్, బీఆర్ఎస్ నాయకులు సంపేట ఉపేందర్, వెంకటరత్నం, బత్తుల ఉపేందర్, వంశీ, ప్రముఖ డాక్టర్లు పాల్గొన్నారు.