Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతరేకంగా ఉద్యమించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు కోరారు.సోమవారం హుజూర్నగర్ పట్టణంలో జరిగిన సీఐటీయూ మండల కన్వీనర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగూ లేబర్ కోడ్లు తెచ్చి 29 కార్మికచట్టాలను కాలగర్భంలో కలిపి వేశారని విమర్శించారు.2020లో కరోనాతో దేశం ఆర్ధికంగా చితికి పోయి కార్మిక వర్గం ఉపాధి కోల్పోయి ఆకలిచావులతో బలైపోతే మరోపక్క మోదీ నిర్ణయాల వల్ల కార్పొరేటర్ల ఆస్తులు అమాంతం రూ.లక్షల కోట్లకు పెరిగాయని విమర్శించారు.ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ దిగ్గజాలైన గుజరాత్ జోడిలకు దారాదత్తం చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారన్నారు.బొగ్గు, రైల్వే, విమానాలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, చమురు, ఖనిజ సంపద మొత్తం ఆధాని, అంబానీ మిత్రులకు దోచిపెట్టారన్నారు.లేబర్ కోడ్ల రద్దుకు ఏప్రిల్ 5న పార్లమెంట్ ముందు జరిగే మహాప్రదర్శనను జయప్రదం చేయాలని కోరారు.సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం. రాంబాబు, రాధాకృష్ణ, వట్టెపు సైదులు, వరలక్ష్మీ, రామ్మూర్తి, రన్మియా, వెంకన్న, రవి, తదితరులు పాల్గోన్నారు.