Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంలో అందరూ పాల్గొని కంటి పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెెంకట్రావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిషాత్మకంగా ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలలో అందరూ కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు.ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఎం కోటాచలం, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.