Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోతె: అన్నదాతలు ఆరుగాలం కష్టించి పొలాలు సాగు చేస్తే కరెంటు కోతలతో ఎండిపోతున్నాయని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం-సూర్యాపేట రహదారి మార్గంలో మామిళ్ల్లగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు టీపీసీసీ ఆదేశాల మేరకు రాస్తారోకోకు దిగారు.ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ పంటలు రైతులు అధిక మొత్తంలో సాగుకు ఖర్చు పెట్టి సేద్యం చేస్తే వచ్చిరాని కరెంటుకు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం పచ్చి బూటకమన్నారు.రైతులు పండించే పత్తికి వరిధాన్యానికి అపరాలకు సరైన మద్దతు ధర ఇచ్చి ఆదుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రతిపక్ష పార్టీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న ప్రేమ రైతన్నలపై కేసీఆర్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.విషయం తెలుసుకున్న ఎస్సై నాగభూషణరావు రాస్తారోకోను విరమింపజేశారు.అనంతరం నాయకులు విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న అధికారికి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదిరెడ్డి,జిల్లా అధ్యక్షులు బి.అశోక్, సర్పంచులు అంగోతు నాగునాయక్, ఆరె పద్మ, ఆంధ్రారెడ్డి, జి.వెంకటేశ్వరరావు, కొర్ర తిరుపతి, నాయకులు పాల్గొన్నారు.