Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేళ్ళచెర్వు
మండలంలోని రామాపురం గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ప్రియాసిమెంట్, జువారి సిమెంట్ కార్మికుల సమావేశం వట్టెపు సైదులు అధ్యక్షతన నిర్వహి ంచారు.ఈసందర్బంగా కార్మిక సమస్యలపై సర్వే చేశారు.కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హుజూర్నగర్ నియో జకవర్గంలో 13 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయన్నారు.ఈ పరిశ్రమల్లో కార్మికులు వేలాది మంది పనిచేస్తు న్నారన్నారు.అదేవిధంగా కార్మికులకు మేనేజ్మెంట్ కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంట్రాక్టర్లు మేనేజ్మెంట్ విఫలమయ్యాయన్నారు.వలస కార్మికులు పనిచేస్తున్నారన్నారు.వీరికి కనీస సౌకర్యం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.సీఐటీయూ పోరాటాల ఫలితంగా సుప్రీంకోర్టు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలనిచెప్పినా అమలు చేయడంలో సిమెంట్ పరిశ్రమలయాజమాన్యాలు విఫల మయ్యా యన్నారు.వివిధ పరిశ్రమల్లో కార్మికులకు డ్యూటీలు 30 ఇవ్వాలని డిమాండ్ చేశారు.కార్మికులు రక్షణ లేక చని పోతున్నారని, వారి కుటుంబాలను యాజమాన్యాలు ఆదుకోవడం లేదన్నారు.కార్మికుల సమస్యలపై రానున్న కాలంలో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షులు శీలం శ్రీను, ప్రియా సిమెంట్ అధ్యక్షులు కార్యదర్శి నాగేశ్వరరావు, ఎస్ ప్రకాష్, కాంతారావు, జువారి సిమెంట్ సంఘం అధ్యక్షుడు అన్నపురెడ్డి సీతారాంరెడ్డి, అజముద్దీన్, లక్ష్మయ్య, ఎస్ఎఫ్ జిల్లా నాయకులు సాయి, మతీన్, వెంకటేశ్వర్లు, కార్మికులు పాల్గొన్నారు.