Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని మాదిగఉద్యోగులసంఘం జిల్లా అధ్యక్షులు చల్లగుండ సోమన్న మాదిగ డిమాండ్ చేశారు.ఆ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ సమావేశం మండలకేంద్రంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణబిల్లు ప్రవేశపెట్టాలని కోరారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 100రోజుల్లోనే ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడ్తామని వాగ్దానం చేసి నేటికీ 9 ఏండ్ల ఆరునెలల కాలం పట్టిందన్నారు.ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పార్టీలకు వచ్చే ఎన్నికలలో మాదిగ ఉద్యోగులు ఓటు అనే ఆయుధంతో దెబ్బతీస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో మాదిగ ఉద్యోగుల రాష్ట్ర జాయింట్ కార్యదర్శి వి.జానకిరాములు, రాష్ట్ర కోశాధికారి జాన్విల్సన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపట్ల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు బరపటి ప్రభాకర్, చేకూరి రమేష్, రాష్ట్ర నాయకులు దున్నశ్యామ్, బట్టు గోపి, జిల్లా కమిటీ బాధ్యులు నెమ్మాది ఉపేందర్, పిడమర్తి సైదులు, జిల్లా నాయకులు పర్వతాలు, నాగారం మండలశాఖ అధ్యక్షులు బొజ్జనాగయ్య, రొడ్డ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.