Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
నిరంతరంగా వ్యవసాయానికి విద్యుత్‌ను సరఫరా చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.రైతులకు 24గంటల కరెంటు అందించాలని కోరుతూ మంగళవారం ఏడీఏ కార్యాల యం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ కోతలు అధికమయ్యా యన్నారు.కోతలతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. వేలాది రూపాయల పెట్టుబ డులు పెట్టిన రైతులు దివాళా తీసే పరి స్దితులు దాపురించాయన్నారు.బోరు బావులకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదని చెప్పారు.కరెంటు కోసం రై తులు పోలాల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు.హై వోల్టేజీ, లోవోల్టేజీ కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని తెలిపారు.ఇప్పటికైనా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని కోరారు.అనంతరం విద్యుత్ ఏడీఏకు వినతిప్రతం అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చందా చంద్రయ్య, రైతుసంఘం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, కౌలు రైతుసంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సైదా,పార్టీ మండల కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, మండల కమిటీ సభ్యులు మండవ వెంకటాద్రి,బట్టు నాగయ్య, ఆరె రామకృష్ణారెడ్డి, రైతుసంఘం మండల కమిటీ సభ్యులు ఎలక జాన్ రెడ్డి, మల్లారెడ్డి, ధర్మయ్య, వీరస్వామి, వీరబాబు, నందిగామ సైదులు, వట్టెపు చిన్నసైదులు, గుర్వయ్య పాల్గొన్నారు.
రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలి
రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి
ఆత్మకూర్‌ఎస్ :అప్రకటిత విద్యుత్‌కోతను నివారించి రైతులకు 24 గంటల విద్యుత్ వ్యవసాయానికి అందించాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఈవిషయమై మంగళవారం ఆత్మకూర్‌ఎస్ సబ్‌స్టేషన్ ముందు రైతుసంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ప్రభుత్వం విద్యుత్ కోతలను నివారించి రైతులకు 24 గంటల పాటు కరెంట్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని వాగ్దానం చేసి, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు.జిల్లా వ్యాప్తంగా కొంతకాలంగా వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్ కోతలను విధించడం మూలంగా లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదన్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి వరినాట్లు విస్తారంగా చేశారన్నారు.విద్యుత్‌కోతతో ఎక్కడికక్కడ నీరు లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు.దీంతో రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు అవిరే అప్పయ్య,మండల అధ్యక్ష కార్యదర్శులు సోమిరెడ్డి దామోదర్‌రెడ్డి, దండ శ్రీనివాసరెడ్డి, విజరురెడ్డి, ఎరుకల నాగరాజు, యాతాకుల మల్లయ్య, పాల్గొన్నారు.
వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
హుజూర్‌నగర్‌టౌన్: వ్యవసాయానికి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు పల్లె వెంకట్‌రెడ్డి,మండల కార్యదర్శి పోసణబోయిన హుస్సేన్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆపార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డీఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగర్ ఆయకట్టుపరిధిలోని నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకుపైగా విద్యుత్ మోటార్లపై ఆధారపడి వరి పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు.ఇటీవల ఏర్పడిన విద్యుత్ కోతల వలన పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యవర్గ సభ్యులు తుమ్మ కొమ్మ యోన, రేపాకుల మురళి,సీనియర్ నాయకులు పాశంవెంకటనారాయణ, పాశంవీరబాబు, పిట్టల నాగేశ్వర్రావు, శీలం వెంకన్న, చింతకుంట వీరయ్య, మీగడరాములు, షేక్‌సైదా, సిద్దులవెంకటయ్య, వట్టికూటి శ్రీను, తంగేళ్ల గోపరాజు, పారుపల్లిశ్రీనివాస్, పిన్నపురెడ్డి వెంకటరెడ్డి, ఆవుల సైదులు ,గడ్డంఅంజయ్య, కుక్కడపువెంకన్న, నక్కనబోయినశంకర్, నకినబోయిన శంభయ్య, సాంబయ్య, వల్లపుదాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు.