Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలోని 16, 17 వార్డులకు సంబంధించి ఫీర్లకొట్టం వీధిలో 13-20 సర్వే నెంబర్లలో గల మున్సిపల్ స్థలం దురాక్రమణకు కాకుండా కాపాడాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి ఆయా వార్డుల ప్రజలు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సైదిరెడ్డి స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు.ఈ స్థలంలో గతంలో మున్సిపల్వాటర్ ట్యాంకు ఉండేదని ,ఆ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో అధికారులు కూల్చివేశారన్నారు.ఉన్న ఖాళీ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని చుట్టూ కర్రలు పాతి తమదే స్థలమని చెప్పుకోవడం అన్యాయమన్నారు.ఈ స్థలం మున్సిపల్ పరిధిలోని ఉందంటూ గతంలో అధికారులు బోర్డు ఏర్పాటు చేశారన్నారు.కానీ కావాలని కొంతమంది కర్రలు పాతడం అన్యాయం అన్నారు మున్సిపల్ అధికారులు ఏమాత్రం ఆలస్యం లేకుండా లేకుంటే వెంటనే స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించినట్టు తెలిసింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆకుల రాము, రాగి రాజశేఖర్, రాజభద్రయ్య,శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.