Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-కోదాడరూరల్
మాదిగలకు నమ్మక ద్రోహం చేసి బీజేపీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు తీగల ప్రదీప్గౌడ్ అధ్యక్షతన ఎంఎస్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించినఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశంలో సంపూర్ణ మెజారిటీతో అధికారం కలిగి ఉండి ఎన్నో బిల్లులను,రాజ్యాంగ సవరణలను పార్లమెంట్లో ఆమోదింపజేసుకుంటున్న బీజేపీ ఒక్క ఎస్సీ వర్గీకరణ పట్ల మాత్రమే నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు.29 ఏండ్లుగా ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపి, కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా బీజేపీ వ్యవహరించడం నమ్మకద్రోహానికి నిదర్శన మన్నారు.ఎస్సీ వర్గీకరణ చేయకుండా బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని మాదిగల ఓట్లు అడగడానికి వస్తారని ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో అత్యదిక జనాభా కలిగి ఉన్నది మాదిగలు మాత్రమేనన్నారు.అలాంటి మాదిగలకు నమ్మక ద్రోహం చేసి బీజేపీ తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వస్తుందో చూస్తామన్నారు.మాదిగలను నమ్మించి మోసం చేసిన బీజేపీ మాత్రమే మాదిగలకు ఏకైక రాజకీయ శత్రువు అని అన్నారు.కనుక బీజేపీ నేతలను మాదిగ వాడల్లోకి రానివద్దన్నారు.మాదిగ బిడ్డలంతా ఏకతాటి మీద ఉండి బీజేపీ మీద యుద్ధం చేయాలని కోరారు.మాదిగల ఆకాంక్షను పట్టించుకోకుండా, ఇంకా నమ్మక ద్రోహానికి పాల్పడితే మాదిగల చేతిలో బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు.రేపు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజుమాదిగ, ఎంఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాధ్మాదిగ, ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్మాదిగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్మాదిగ, జాతీయ అధికార ప్రతినిధి బొర్ర భిక్షపతిమాదిగ, ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న, ఎంఎస్పీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజయ్య, ఎంఎస్పీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఏపూరి రాజుమాదిగ, ఎంఈఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు యలమర్తి రాము,వడ్డేపల్లి కోటేష్, కొత్తపల్లి అంజయ్య, వడ్డేపల్లి రామకృష్ణ, పిడమర్తి వెంకట్రావు,ఏపూరి సత్యరాజు, తదితరులు పాల్గొన్నారు.