Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలో 40ఏండ్లకు ముందే పారిశ్రామిక వాడ ఏర్పడిందని కానీ మౌలిక వసతులు లేక చిన్న మధ్యతరహా పరిశ్రమలు నిలబడలేక పోయాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు ఆన్నారు.రాష్ట్ర కమిటీలో భాగంగా పట్టణ ఇండిస్టియల్ ఏరియా శాంతినగర్లో ఎస్బీఎం టెక్నాలజీలో సీఐటీయూ అధ్వర్యంలో నిర్వహించిన పారిశ్రామిక కార్మిక సర్వేలో ఆయన మాట్లాడారు.ఈ ప్రాంతంలో సువెన్ ఫార్మాకంపెనీ, సుధాకర్ పీవీసీ కంపెనీ, చిన్న చిన్న ఇంజనీరింగ్, రైస్ ఇండిస్టీ మార్బుల్, బ్రిక్స్, సామిల్స్,దాల్మిల్లు, పరిశ్రమల్లో రోజూ వారి సీడబ్ల్యూ హామాలీలు, పర్మినెంట్, కాంటాక్ట్ పద్ధతిలో 6వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారని తెలిపారు.వారికీ పీఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌక్యారాలు లేవన్నారు.అదేవిధంగా పనిగంటలు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పని చేయాల్సి వస్తుందని తెలిపారు.ఇదేంటని అడిగే పరిస్థితి లేదని యాజమాన్యాల ఇష్టాఇష్టాలపై ఆధారపడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.సేప్టీ పరికరాలు లేవన్నారు.పట్టణంలో స్వంత ఇల్లు లేక అద్దె ఇండ్లల్లో ఉండి కనీసవేతనం కొరవడి కుటుంబాలు గడవని పరిస్థితి ఉందన్నారు..ప్రతి కార్మికునికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.శాంతినగర్ పారిశ్రామిక వాడలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు.కనీసవేతనం అమలు చేయాలని కోరారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, మహిళ కార్మికులకు యాజమాన్యాలు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలన్నారు.ప్రతి కార్మికులకు యూనిఫాం, బోనస్ ఇవ్వాలని కోరారు.మార్చి ఒకటిన హైదరాబాద్లోని పారిశ్రామిక కమిషనర్ కార్యలయం ముందు నిర్వహించే 24 గంటల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వల్లపుదాసు సాయికుమార్, నాగేశ్వరాచారి, మహేష్, ప్రవీణ్,సాయికృష్ణ, షేక్ యాకుబ్ పాల్గొన్నారు.